ప్రముఖ వ్యాపారవేత్త, స్టాక్‌మార్కెట్ దిగ్గజం రాకేశ్ ఝున్ ఝున్ వాలా (62) కన్నుమూశారు. ముంబుయిలో గుండెపోటుతో ఆయన హఠాన్మరణం చెందారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో సహా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కొన్ని వారాల క్రితం ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రికి తరలించారు. అయితే వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు ధ్రువీకరించారు. జులై 5, 1960లో హైదరాబాద్‌లో జన్మించిన రాకేష్ రaున్‌రaున్ వాలాకు చిన్న తనం ఉంచి వ్యాపారం అంటే మక్కువ. అందుకే కాలేజీ విద్యార్థిగా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. 1985లో రూ.5వేల పెట్టుబడితో స్టాక్ మార్కెటర్‌గా వ్యాపారాన్ని ప్రారంభించారు. సెప్టెంబర్ 2018 నాటికి అతని ఆస్తి రూ.11 వేల కోట్లకు పెరిగింది. రాకేశ్‌ను బిగ్ బుల్, వారెన్ బఫేట్ ఆఫ్ ఇండియా అని పిలుస్తుంటారు. రaున్‌రaున్‌వాలా మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
