Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ఆహా అనిపించిన సరస్వతీ టీకే ఫుడ్ ఆర్ట్ ఎగ్జిబిషన్

న్యూయార్క్ : జూన్ 10: అందరు అన్ని బొమ్మలు గీస్తారు.. కానీ ఆమె బొమ్మలు చాలా చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఆమె బొమ్మలు చూస్తే మీకు నోరు ఊరుతుంది.. తెలంగాణకు చెందిన మన తెలుగుబిడ్డ అమెరికాలో ఏర్పాటుచేసిన ఆర్ట్ ఎగ్జిబిషన్ ఆహా అనిపించింది. న్యూజెర్సీలో ఉంటున్న సరస్వతీ టీకే ఎప్పుడూ సరికొత్తగా ఆలోచిస్తూ ఉంటుంది. అమెరికాలో ఫుడ్ ఆర్ట్‌కు మంచి క్రేజ్ ఉంది. అయితే ఆ ఫుడ్ ఆర్ట్స్ అంతా అమెరికన్ ఫుడ్స్ మీదే ఉంటాయి. అసలు మనం కూడా మన తెలుగు వంటకాలను, భారతీయ వంటకాలపై బొమ్మలు వేస్తే ఎలా ఉంటుంది..? మన వంటకాలు కూడా తెలియని వాళ్లకు కచ్చితంగా తెలుస్తాయి కదా..! ఇలాంటి ఆలోచనలతో మన ఆహార సంస్కృతిని కూడా విదేశీయులకు సరికొత్తగా పరిచయం అవుతుందనే భావనతో సరస్వతీ టీకే మన భారతీయ ఆహార చిత్రాలపై దృష్టి పెట్టింది. ఎంతో కళాత్మకంగా, సృజనాత్మకంగా వాటిని గీసి చక్కటి రంగులు అద్దింది. అవి బొమ్మలా..? నిజమైనవా అనే రీతిలో ఆ చిత్రాలను రూపుదిద్దింది. ఇలా తన అభిరుచితో వేసిన చిత్రాలన్నింటితో ఓ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటుచేసింది. మహిళల్లో దాగిన కళ, సృజనాత్మకతను నిత్యం ప్రోత్సాహించే నాట్స్ బోర్డు చైర్ విమెన్ అరుణ గంటి ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను సందర్శించి సరస్వతి టీకే ప్రతిభపై ప్రశంసల వర్షం కురిపించారు.
భారత కౌన్సెల్ జనరల్ కార్యాలయం నుండి విపుల్ దేవ్ (కల్చర్)
ఇలాంటి మరిన్ని చిత్రాలు వేసి సరస్వతి టీకే మన భారతీయ సంస్కృతిని, ఆహారపు అలవాట్లను విశ్వవ్యాప్తం చేయాలని నాట్స్ చైర్ వుమన్ అరుణ గంటి, బోర్డ్ అఫ్ డైరెక్టర్ రాజ్ అల్లాడ ఆశాభావం వ్యక్త పరిచారు.
ఇంకా.. మురళీకృష్ణ మేడిచెర్ల, బిందు ఎలమంచిలి, డా. మాధురి అడబాల, గీత గొల్లపూడి, ఆశ వైకుంఠం
కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి సరస్వతికి అభినందనలు తెలియచేసారు.
G3 ఈవెంట్స్ – గాయత్రి బోయపల్లి ఈ ఈవెంట్ కు ఈవెంట్ మేనేజ్మెంట్ గా వ్యవహరించారు.
గతం లో క్రెడిట్ స్విస్ అనే ఫైనాన్స్ సంస్థ లో పనిచేసిన సరస్వతి తో పరిచయం ఉన్న పలువురు కళాభిమానులు, స్నేహితులు విచ్చేసి షో ఆసాంతం తిలకించి అభినందనలతో ముంచెత్తారు. సరస్వతి భర్త నాగరాజు పలివెల తనకు అన్ని విషయాలలో సహాయపడుతూ ఎంత గానో ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు.
చివరిగా సరస్వతి మాట్లాడుతూ, పెయింటింగ్ తో నే సరిపెట్టకుండా, త్వరలో నోటికి కూడా ఆ మధురానుభూతిని అందించటానికి తనవంతు కృషి చేస్తున్నట్టు ప్రకటించారు.

Related Posts

Latest News Updates