బీహార్ లో దారుణం జరిగింది. బీజేపీ మాజీ నేత నుపుర్ శర్మ వీడియో చూసినందుకే అంకిత్ ఝా (23) ను దుండగులు చంపేందుకు ప్రయత్నించారు. 6 సార్లు కత్తితో పొడిచారు. దీంతో అంకిత్ ను ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో అంకిత్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో మొత్తం ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంకిత్ ఝా పాన్ షాప్ వద్ద నిలబడి, నుపుర్ శర్మ వీడియో చూస్తున్న సమయంలో అక్కడే సిగరెట్ తాగుతున్న వ్యక్తితో వాగ్వాదం జరిగిందని చుట్టుపక్కల వారు అంటున్నారు.
తర్వాత నిందితుడు అతని అనుచరుతో వచ్చి అంకిత్ పై 6 సార్లు కత్తితో పొడిచారు. అయితే.. పోలీసులు మరో కోణం చెబుతున్నారు. ఈ ఇద్దరి వ్యక్తుల మధ్య గొడవలు వున్నాయని, నుపుర్ శర్మ వీడియో చూసినందుకు కత్తి పోట్లు పొడవలేదని అంటున్నారు. అయితే… దాడికి సంబంధించి నుపుర్ శర్మ కేసు గురించి ఫిర్యాదులో నమోదు చేశామని, ఆ తర్వాత పోలీసులు దానిని మార్చారంటూ అంకిత్ ఝా కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.