కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఆగస్టు 21న ఆయన నల్గొండ జిల్లా మునుగోడుకు రానున్నారు. ఆరోజు సాయంత్రం 4 గంటలకు అక్కడ నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారని తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్ ఛుగ్ వెల్లడిరచారు. ఈ సందర్భంగా తరుణ్ చుగ్ మీడియాతో మాట్లాడుతూ మునుగోడు సభలోనే తాజా మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరతారని ఆయన ప్రకటించారు. అలాగే ఇతర పార్టీల నుంచి భారీగా చేరికలు ఉంటాయని పేర్కొన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని ఆయన ఆరోపించారు.
