Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ఎంపీ ఒవైసీ ఇంటిపై రాళ్ల దాడి… నాలుగోసారి అంటూ ఆగ్రహం

హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై దాడి జరిగింది. ఢిల్లీలోని తన నివాసంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేశారని ఒవైసీ పేర్కొన్నారు. ఈ దాడిలో తన ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయని తెలిపారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేశారు. ఈ దాడి నేపథ్యంలో ఒవైసీ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2014 నుంచి ఇప్పటి వరకు 4 సార్లు తన ఇంటిపై దాడి జరిగిందని మండిపడ్డారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఒవైసీ ఫిర్యాదు చేయడంతో ఢిల్లీ అదనపు డీసీపీ నేతృత్వంలోని పోలీసుల బృందం ఆయన నివాసానికి వెళ్లి నుంచి ఆధారాలు సేకరించింది. దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Related Posts

Latest News Updates