పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నసమయంలో లోక్ సభ సెక్రెటేరియట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నెల 18 నుంచి పార్లమెంట్ వర్షాకాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ సందర్భంగా సభలో సిగ్గుచేటు, వేధించడం, మోసగించడం, అవినీతిపరుడు, డ్రామా, నియంత, హిపోక్రసీ, జుమ్లాజీవి, స్నూప్ గేట్ లాంటి పదాలను వాడొద్దని లోక్ సభ సెక్రెటేరియట్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అలాగే.. శకుని, తానాషా, వినాశ్ పురుష్, ఖలిస్తానీ, చెంచాగిరి, పిరికి, క్రిమినల్, మొసలి కన్నీళ్లు, గాడిద, అసమర్థుడు, గూండాలు, అహంకారి, చీకటి రోజులు, లైంగిక వేధింపులు, విశ్వాస ఘాతకుడు అనే పదాలను కూడా వాడొద్దని స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. ఆయా సభ్యులు తమ ప్రసంగాల్లో ఈ పదాలు వాడొద్దని సెక్రెటేరియట్ స్పష్టం చేసింది.
అయితే.. సభ్యులు ప్రసంగిస్తున్న సమయంలో కాస్త ఆవేశంలో పడిపోయి.. ఘాటైన పదాలు, తప్పుడు పదాలు వాడుతుంటారు. వాటిని అన్ పార్లమెంటేరియన్ పదాలు అని వాడుకలోనే వున్నాయి. వాటిని స్పీకర్, రాజ్యసభ చైర్మన్ రికార్డులను నుంచి తొలగిస్తుంటారు. ఇకపై.. పైనిచ్చిన పదాలను కూడా వాడొద్దు.