Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

హైదరాబాద్ శివార్లలో కోడి పందేలు.. పోలీసులు దాడి చేయడంతో పరారైన చింతమనేని?

హైదరాబాద్ శివార్లలో పెద్ద ఎత్తున జరుగుతున్న కోడి పందాల స్థావరాలపై పోలీసులు దాడి చేశారు. ఈ స్థావరాల్లో పెద్ద మొత్తంలో కోడి పందేరాలు జరుగుతున్నాయని పోలీసులు దాడులు నిర్వహించారు. పటాన్ చెరులో లక్షల్లో బెట్టింగ్ లు పెడుతూ, కోడి పందేలు నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. అయితే ఈ పందేరాల్లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో పాటు మరికొంత మంది వీవీఐపీలు వున్నారని తెలుస్తోంది. పోలీసులు దాడులు చేయడంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని అక్కడి నుంచి పరార్ అయ్యారు.

ఇక ఈ దాడుల్లో 20 మందికి పైగా బెట్టింగ్ రాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. పటాన్ చెరు డీఎస్పీ ఆధ్వర్యంలో ఈ దాడులు జరుగుతున్నాయి. ఈ దాడిలో భారీగా నగదు, కోళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 13,12,140 రూపాయల నగదు, 26 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Related Posts

Latest News Updates