పాట్నా నుంచి ఢిల్లీ వెళ్లే స్పైస్ జెట్ విమానానికి పెను ప్రమాదమే తప్పింది. ఈ స్సైస్ జెట్ విమానంలోని ఇంజిన్ లో సాంకేతిక సమస్య ఎదురైంది. దీంతో టెకాఫ్ అయిన సమయంలో ఎడమ ఇంజిన్ ను హఠాత్తుగా పక్షి ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగగానే పైలెట్ లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించారు. ఆ తర్వాత ఇంధన సరఫరాను నిలిపేసి, పైలెట్లు ల్యాండింగ్ చేసేశారు. చివరికి పాట్నా ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ చేసేశారు.
మరోవైపు ఈ సమయంలో స్పైస్ జెట్ లో మొత్తం 185 మంది ప్రయాణికులు వున్నారు. వీరందర్నీ పోలీసులు, ఎయిర్ పోర్ట్ అధికారులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అయితే ఈ విమానం రెండు బ్లేడ్లు కూడా వంకర పోయాయి. తదుపరి దర్యాప్తు చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.