ఏపీలో తెలుగుదేశం నాయకులపై వైసీపీ సర్కార్ నిఘా పెడుతోందని పీఏసీ చైర్మన్, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆరోపించారు. సమాజానికి హానికరమైన వ్యక్తులపై నిఘా పెట్టాలి కానీ… తమపై పెడితే ఏమోస్తుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజకీయ నేతలు, సొంత ఎమ్మెల్యేలు, సాక్షి పత్రిక ఉద్యోగులపై కూడా సీఎం జగన్ నిఘా పెట్టారని ఆరోపించారు. పెగాసస్ వ్యవహారంలో వైసీపీ తమపై చేస్తున్న ప్రచారం పూర్తిగా తప్పని కొట్టిపారేశారు.
ఎవరిపై ఎవరు నిఘా పెట్టారో తెలుసుకునేందుకు ఆడిట్ కు సిద్ధమా? అంటూ పయ్యావుల ప్రభుత్వానికి సవాల్ విసిరారు. అంతేకాకుండా పెగాసస్ విషయంలో తమపై ఆరోపణల విషయంలో రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా వున్నారా? అంటూ కూడా ప్రశ్నించారు. పెగాసస్ విషయంలో వైసీపీ అభూత కల్పనలు చేస్తోందని పయ్యావుల మండిపడ్డారు.