తెలంగాణ సీఎం కేసీఆర్ పై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. సకాలంలో ఉద్యోగులకు జీతాలు అందడం లేదని ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. సగం నెల కావొస్తున్నా.. సగానికి పైగా జిల్లాల ఉద్యోగులకు జీతాల్లేవని మండిపడ్డారు. వంతుల వారీగా జీతాలివ్వడం చరిత్రలో ఎన్నడూ లేదని, ఇదే పద్ధతి అని ఎద్దేవా చేశారు. జీతమో రామచంద్రా అంటూ ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణను దివాళా తీయించారని, ఇంత కంటే నిదర్శనం ఏం కావాలంటూ రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు.
జీతమో రామ”చంద్రా” అంటున్నారు ఉద్యోగులు!
సగం నెల కావస్తున్నా సగానికి పైగా జిల్లాల ఉద్యోగులకు జీతాల్లేవ్. వంతులవారిగా జీతాలివ్వడం చరిత్రలో ఎన్నడు లేదు.రాష్ట్రాన్ని కేసీఆర్ దివాళా తీయించాడని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?#ByeByeKCR#KCRFailedTelangana pic.twitter.com/sUAyKSVXZJ
— Revanth Reddy (@revanth_anumula) July 13, 2022