Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ఫోర్బ్స్ ఇండియాలో పెద్దపల్లి కుర్రాడు

ఫోర్బ్స్ ఇండియాలో తెలంగాణలోని పెద్దపల్లికి చెందిన యువకుడు సత్తా చాటాడు. ఫోర్బ్స్ ఇండియా భారత్ టాప్`100 డిజిటల్ స్టార్స్ జాబితాలో గోదావరిఖనికి చెందిన హఫీజ్ 32వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. హఫీజ్ jైుటింక్లయిన్ కాలనీలో కంప్యూటర్ సెంటర్ను నిర్వహిస్తున్నారు. 2011లో తెలుగు టెక్ట్యూట్స్ పేరిట యూట్యూబ్ చానల్ను ప్రారంభించాడు. ఈ చానల్ ద్వారా కంప్యూటర్ కోర్సులు, మొబైల్ టెక్నాలజీతోపాటు కొత్తగా మార్కెట్లోకి విడుదలయ్యే మొబైల్ ఫోన్ల పూర్తి సమాచారాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన యూట్యూబ్ చానల్కు 15.70 లక్షల మంది సబ్ స్క్రైబర్లున్నారు. ఫోర్బ్స్ ఇండియా, గ్రూప్`ఎం, ఐఎన్సీఏ సంయుక్తంగా విడుదల చేసిన ఈ జాబితాలో డిజిటల్ స్టార్స్ ఎంపికకు తొమ్మిది కేటగిరీల్లో స్కోర్ ఇచ్చారు. వెబ్లో ముఖ్యంగా యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో హాస్యం, అందం, ఫ్యాషన్, వ్యాపారం`ఆర్థికం, టెక్, సామాజిక సేవ కేటగిరీల్లో ఎక్కువ మంది ఫాలోయర్లను ఉన్నవారిని ఎంపిక చేశారు. తాజాగా ఆయనకు ఫోర్బ్స్ ఇండియా మేగజైన్లో చోటు దక్కడం పట్ల తెలుగు టెక్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related Posts

Latest News Updates