ప్రధాని మోడీ మధ్యప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా భోపాల్- న్యూఢిల్లీ మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు. ఏప్రిల్ 1న భోపాల్‌లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్ నుంచి భోపాల్-న్యూఢిల్లీ మార్గంలో 11వ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా పాల్గొన్నారు.
ఈ రైలుతో రెండు ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గిస్తోంది. భోపాల్ నుంచి న్యూఢిల్లీ సెమీ హై స్పీడ్ రైలులో 7 గంటల 45 నిమిషాల్లో చేరనున్నారు. వందే భారత్ రైలులో స్కూల్ విద్యార్థులు, రైల్వే సిబ్బందితో ముచ్చటించారు. భారత దేశ నైపుణ్యం, పనితనం, ఆత్మస్థైర్యాన్ని ప్రపంచానికి చూపిస్తోందన్నారు. గత ప్రభుత్వాలు కొన్ని వర్గాలను సంతుష్టీకరణ చేయడంలో తెగ బిజీగా వుండేవని, కానీ… తమ ప్రభుత్వం మాత్రం దేశ ప్రజలందరి ఆశయాలను నెరవేర్చడానికి సదా పనిచేస్తోందని పేర్కొన్నారు.