చెరకు, మొక్కజొన్న వంటివాటి నుంచి లభించే ఇథనాల్‌ను పెట్రోల్‌తో కలపాలన్న ప్రభుత్వ నిర్ణయంతో రైతుల ఆదాయం గణనీయంగా పెరిగిందని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల ఆదాయాన్ని పెంచేందుకు తమ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు ఫలితాన్ని చూపిస్తున్నాయని పేర్కొన్నారు. పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం గత ఎనిమిదేళ్లలో పదిరెట్లు పెరిగిందని, 2014 ఏడాదికి ముందు ఇది 40 కోట్ల లీటర్లు ఉండగా ఇప్పుడు 400 కోట్ల లీటర్లకు చేరిందని పేర్కొంటూ ఈ ప్రక్రియతో రైతుల ఆదాయం కూడా పెరిగిందని చెప్పారు.గుజరాత్ రాష్ట్రం హిమ్మత్‌నగర్ సమీపంలోని సబర్ డెయిరీకి చెందిన పలు ప్రాజెక్టులను గురువారం ప్రారంభించారు. వ్యవసాయ ఖర్చులను తగ్గించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోందని, అందుకే ఇటీవల కాలంలో అంతర్జాతీయంగా ధరలు అనేక రెట్లు పెరిగినా ఎరువుల ధరలు పెంచలేదని ప్రధాని గుర్తు చేశారు.
2014 లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల ఆదాయాన్ని పెంచేందుకు తమ ప్రభుత్వ పనిచేస్తోందని, ఆ ప్రయత్నాలు ఇన్నటికి ఫలించాయని మోదీ హర్షం వ్యక్తం చేశారు. చెరకు, మొక్కజొన్న వంటి వాటి నుంచి వచ్చే ఇథనాల్ ను పెట్రోల్ తో కలపాలన్న తమ నిర్ణయంతో రైతు ఆదాయం పెరిగిందని, దీని వల్ల భూమిలేని, సన్నకారు రైతులకు ఎక్కువ ప్రయోజనం చేకూరిందని వివరించారు. మత్స్య పరిశ్రమ, తేనె ఉత్పత్తి వంటి అనుబంధ రంగాలను కూడా ప్రోత్సహిస్తామని, దాని ద్వారా రైతు ఆదాయం పెరిగుతుందని మోదీ వివరించారు. వ్యవసాయ ఖర్చులను తగ్గించేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నామని, అందుకే అంతర్జాతీయంగా ధరలు అనేక రెట్లు పెరిగినా, ఎరువుల ధరలను మాత్రం తాము పెంచలేదని మోదీ గుర్తు చేశారు.