ఆయా పార్టీలు తమ తమ ఓట్ల కోసం ఇచ్చే ఉచిత హామీలు దేశానికి అత్యంత హానికరమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఈ ఉచిత హామీల పట్ల ప్రజలు అప్రమత్తంగా వుండాలని, ముఖ్యంగా యువత అప్రమత్తంగా వుండాలని మోదీ పిలుపునిచ్చారు. యూపీలో యోగి హయాంలో శాంతిభద్రతలు మెరుగుపడ్డాయన్నారు. రాష్ట్రం కూడా వేగంగా డెవలప్ అవుతోందని మోదీ పేర్కొన్నారు. దేశం మొత్తం యూపీవైపు చూస్తోందని మోదీ తెలిపారు. యూపీలో నిర్మించిన 296 కిలోమీటర్ల బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ రహదారిని మోదీ ప్రారంభించారు.
296 కిలోమీటర్ల బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ రహదారిని 14,850 కోట్ల వ్యయంతో నిర్మించారు. యూపీలోని 7 జిల్లాలను ఇది కలుపుతుంది. గతంలో నాలుగు లైన్లు మాత్రమే ఈ రహదారి వుండేది. ఇప్పుడు 6 లైన్లకు విస్తరించింది. అభివృద్ధి కేవలం నగరాలకే కాకుండా గ్రామాలకు కూడా విస్తరిస్తున్నామని మోదీ పేర్కొన్నారు. శాంతిభద్రతలు, కనెక్టివిటీ సరిగ్గా వుంటేనే.. రాష్ట్రం పారిశ్రామికంగా పరుగులు పెడుతుందని మోదీ తెలిపారు.