Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

RRR లోని నాటు నాటు కి ఆస్కార్…. అభినందనలు తెలుపుతున్న రాజకీయ ప్రముఖులు

95 వ ఆస్కార్ అవార్డుల వేడుకలో RRR సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. RRR చిత్ర యూనిట్ కి అభినందినలు తెలిపారు. నాటు నాటు పాట పాపులారిటీ విశ్వవ్యాప్తమైందని పేర్కొన్నారు. నాటు నాటు పాట చరిత్రలో మరుపురాని పాటగా వుండిపోతుందని పేర్కొన్నారు. ఏళ్లకేళ్లు ఈ పాటను గుర్తు చేసుకుంటూనే వుంటారని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కీరవాణి, చంద్రబాస్ తో పాటు చిత్ర యూనిట్ కి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. అలాగే బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కేటగీరిలో అవార్డు అందుకున్న ఎలిఫెంట్ విస్పరర్స్ చిత్ర యూనిట్ కి కూడా మోదీ శుభాభినందనలు తెలిపారు.

 

నాటు నాటు కు ఆస్కార్ అవార్డు రావడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. విశ్వ వ్యాపితంగా తెలుగు సినిమా సత్తా చాటిందని అభినందించారు. ప్రతిష్ఠాత్మకమైన అవార్డును గెలుచుకోవడం తెలుగు వారికే గర్వకారణమన్నారు. నాటు నాటు పాట తెలంగాణ సంప్రదాయానికి అద్దం పట్టిందని, తెలుగు ప్రజల అభిరుచి కూడా కనిపించిందన్నారు. చంద్రబోస్ ను కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు.

 

తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా RRR యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. నాటు నాటు పాట భారతీయులకు గర్వాన్ని తెచ్చిందన్నారు. కీరణవాణి, కీరవాణి చరిత్ర నెలకొల్పారన్నారు. రాజమౌళితో సహా చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు.

 

ఇక… చంద్రబాబు నాయుడు కూడా చిత్ర యూనిట్ కి కంగ్రాట్స్ చెప్పారు. ఆస్కార్ అవార్డు దక్కించుకొని నాటు నాటు ఖ్యాతి గడించిందన్నారు. భారతీయ చిత్రానికి గర్వించే క్షణాలని అఢివర్ణించారు. రాజమౌళి, కీరణవాణి, ఎన్టీఆర్, రాంచరణ్, కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ తదితరులకు చంద్రబాబు కంగ్రాట్స్ చెప్పారు.

 

టీడీపీ యువ నేత నారా లోకేశ్ కూడా టీమ్ కి కంగ్రాట్స్ చెప్పారు.భారత్ గర్వించే క్షణాలన్నారు. అందరి నమ్మకాలను నిజం చేస్తూ ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు ఆస్కార్ ను గెలుచుకుందని హర్షం వ్యక్తం చేశారు. ఇంతటి గొప్ప పురస్కారాన్ని అందుకున్న ఆర్ఆర్ఆర్ టీమ్ మొత్తానికి అభినందనలు తెలిపారు.

 

 

Related Posts

Latest News Updates