ప్రధాని నరేంద్ర మోదీ, పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ కలుసుకోనున్నారు. ఉజ్బెకిస్తాన్ లోని సమర్ ఖండ్ లో జరిగే షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా వీరిద్దరూ సమావేశమయ్యే ఛాన్స్ వున్నట్లు దౌత్య వర్గాలు పేర్కొన్నాయి. పాకిస్తాన్ పత్రిక డైలీ జాంగ్ ప్రకారం… SCO శిఖరాగ్ర సమావేశాలు వచ్చే నెల 15,16 తేదీల్లో జరుగుతాయి. తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సందర్భంగా పాక్ ప్రధానితో మోదీ భేటీ అయ్యే ఛాన్స్ వుంది. పాక్ ప్రధానితో పాటు మోదీ చైనా, రష్యా, ఇరాన్ అధ్యక్షులతో కూడా భేటీ కానున్నారు.
అయితే.. మోదీ, పాక్ ప్రధాని భేటీ అనేది ఇంకా షెడ్యూల్ కాలేదని పాక్ విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. ఇక… రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ , చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ కూడా సమర్‌కండ్‌లో జరిగే అదే సమావేశానికి హాజరుకానున్నారు. వీరిద్దరూ సమావేశాలకు వస్తే.. ఈ ఇద్దరు నేతలలు కూడా సమావేశం కావచ్చని అంతర్జాతీయ మీడియా అంచనా వేస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పుతిన్‌ను గాల్వన్ వ్యాలీ ఘటన తర్వాత జీ జిన్‌పింగ్‌ను ప్రధాని మోదీ కలవలేదు.