బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ కు చేరుకున్నారు. బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ తమిళిసై, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్, విజయశాంతి, ఈటల రాజేందర్ తదితరులు ఘన స్వాగతం పలికారు. బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా నోవాటెల్ హోటల్ కు వెళ్లారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మోదీ కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యారు. రాత్రి 9 గంటల వరకు మోదీ అక్కడే వుంటారు.
ట్వీట్ చేసిన ప్రధాని మోదీ
డైనమిక్ సిటీ హైదరాబాద్ లో జరుగుతున్న బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో పాల్గొనేందుకు నగరానికి చేరుకున్నాను. ఈ సమావేశంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పలు అంశాలపై చర్చిస్తాం అంటూ మోదీ ట్వీట్ చేశారు.
డైనమిక్ సిటీ హైదరాబాద్ లో జరుగుతున్న @BJP4India నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో పాల్గొనేందుకు నగరానికి చేరుకున్నాను. ఈ సమావేశంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన పలు అంశాలపై చర్చిస్తాం. pic.twitter.com/wOrG9GvabO
— Narendra Modi (@narendramodi) July 2, 2022