ప్రధాని నరేంద్ర మోదీ తన ఉపన్యాసం ప్రారంభంలో తెలుగులో మాట్లాడి సభికులను ఆకర్షించారు. సోదర సోదరీమణులకు నమస్కారం అంటూ ప్రారంభించారు. ఎంతో దూరం నుంచి వచ్చిన ప్రతి కార్యకర్తకు అభినందనలు. తెలంగాణ నేల తల్లికి వందనం చేస్తున్నాను. తెలంగాణ గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. తెలంగాణ మొత్తం ఈ మైదానంలోనే వున్నట్లు అనిపిస్తోంది.
హైదాబాద్ నగరం అన్ని రంగాల వారికి అండగా వుందన్నారు. తెలంగాణ పవిత్ర భూమి అని, దేశ ప్రజలకు యాదాద్రి నరసింహ స్వామి, గద్వాల జోగులాంబ, వరంగల్ భద్రకాళి అమ్మ వారి ఆశీస్సులు వుంటాయన్నారు. భద్రాచలం రామదాసు నుంచి పాల్కురి సోమనాథుడి వరకు ఇక్కడి పుడమి గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే అని అన్నారు. ఇలాంటి తెలంగాణను అభివృద్ధి చేయడానికి బీజేపీ తొలి ప్రాధాన్యం ఇస్తుందని మోదీ పేర్కొన్నారు.