అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రజలందరూ విజయవంతం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ఈ యోగ దినోత్సవాన్ని విజయవంతం చేసి, యోగాకు మరింత ప్రాచుర్యం కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు.
మానవత్వం కోసం యోగ అన్న నేపథ్యంతో మార్గనిర్దేశనం చేస్తూ, యోగ దినోత్సవాన్ని జరుపుకోవాలని సూచించారు. ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రజలు తప్పనిసరిగా యోగాను చేయాలని కోరారు. ఇక ఈసారి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రధాని మోదీ మైసూరులో జరుపుకోనున్నారు. అక్కడ జరిగే యోగా దినోత్సవాల్లో పాల్గొంటారు.
రేపు, జూన్ 21ని అంతర్జాతీయ యోగ దినోత్సవంగా జరపుకుంటున్నాం. ‘మానవత్వం కోసం యోగ’ అనే నేపథ్యంతో మార్గనిర్దేశం చేస్తూ, ఈ యోగ దినోత్సవాన్ని విజయవంతం చేసి, యోగను మరింత ప్రాచుర్యంలోకి తీసుకువ ద్దాం. https://t.co/UESTuNPNbW
— Narendra Modi (@narendramodi) June 20, 2022