భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేసిన సందర్భం ఉద్విగ్న భరిత క్షణమని అభివర్ణిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. రాష్ట్రపతిగా ముర్ము ప్రమాణ స్వీకార వేడుకను దేశం మొత్తం ఎంతో గర్వంగా చూసిందని మోదీ ట్విట్టర్ లో పేర్కొన్నారు. ముర్ము రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టడం దేశం మొత్తానికి ఉద్విగ్న క్షణాలని, ముఖ్యంగా పేదలు, అట్టడుగు వర్గాల వారికి మరింత ఉద్విగ్న క్షణాలని పేర్కొన్నారు. ముర్ము తన బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేయాలని భావిస్తున్నానని మోదీ ఆకాంక్షించారు. ప్రమాణ స్వీకారం తర్వాత కరుణతో కూడిన స్పీచ్ ఇచ్చారని, భారత దేశ విజయాలను కూడా పునరుద్ఘాటించారని మోదీ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. అలాగే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న సందర్బంలో దేశ విజయాలను ప్రస్తావించారని మోదీ ట్వీట్ చేశారు.
భారత 15 వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఇవ్వాళ పార్లమెంట్ సెంట్రల్ హాలులో ప్రమాఫ స్వీకారం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా ముర్ముకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక… పదవీ ప్రమాణం తర్వాత ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్ర మంత్రులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
https://twitter.com/narendramodi/status/1551449327293239296?s=20&t=hddk7o3t-BHfoNZef7U0Jg