తెలంగాణ రాష్ట్రంతో పాటు మరో 6 రాష్ట్రాల్లో మెగా టెక్స్ టైల్ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. పీఎం మిత్ర మెగా టెక్స్ టైల్స్ పార్కు పేరుతో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ టెక్స్ టైల్ పార్కు ఫార్మ్ టు ఫైబర్ టు ఫ్యాక్టరీ టు ఫ్యాషన్ టు ఫారెన్ అన్న విజన్ కి అనుగుణంగా వీటిని ప్రోత్సహిస్తున్నట్లు ప్రకటించారు.
తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, యూపీ రాష్ట్రాల్లో ఈ మెగా టెక్స్ టైల్స్ పార్కులు ఏర్పాటు కానున్నాయి. మేకిన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్ కి గొప్ప ఉదాహరణగా మోదీ అభివర్ణించారు. పీఎం మిత్రా మెగా టెక్స్ టైల్స్ పార్కులు టెక్స్ టైల్స్ రంగానికి అత్యాధునిక మౌలిక సదుపాయాలు కల్పిస్తాయని, కోట్లాడి పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉద్యోగాలు వస్తాయని మోదీ వివరించారు.