పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పార్లమెంట్ కు వచ్చిన ప్రధాని మోదీ.. మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. కొత్త ఎంపీలు, యువ సభ్యులు చర్చల్లో పాల్గొనేలా అందరూ సహకరించాలని, వారిని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. సభలకు ఆటంకం జరిగితే… కొత్త తరం ఎంపీలు మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు. వారి బాధను అందరు తప్పకుండా అర్థం చేసుకుంటూ నడుచుకోవాలపని మోదీ పిలుపునిచ్చారు.
జీ 20 కి భారత్ అధ్యక్షత వహించిన సమయంలో ఈ సమావేశాలు జరగడం ప్రాధాన్యం సంతరించుకుందని వివరించారు. భారత్ పై ప్రపంచానికి చాలా అంచనాలు పెరిగాయని, ప్రపంచ వేదికలపై భారత్ భాగస్వామ్యం పెరుగుతోందని మోదీ వివరించారు. జీ20 కేవలం దౌత్య సమావేశం మాత్రమే కాదని, భారత్ సామర్థ్యాన్ని ప్రపంచం ముందు ప్రదర్శించే అవకాశమని మోదీ అభివర్ణించారు.