తమ గ్రామ సమస్యలు పరిష్కరించాలంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావు పేట రామన్నగూడెం వాసులు ఛలో ప్రగతి భవన్ కు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా వారందరూ హైదరాబాద్ కు బయల్దేరారు. అయితే.. ఈ పాదయాత్ర ప్రారంభమై.. గ్రామం దాటేలోపే పోలీసులు అడ్డుకున్నారు. ఛలో ప్రగతి భవన్ కు నుమతి లేదని తేల్చి చెప్పారు. దీంతో గ్రామస్థులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులు బలవంతంగా కొందర్ని తమ వాహనాల్లో ఎక్కించుకున్నారు.
తమ గ్రామానికి వున్న ప్రధాన సమస్యలను పరిష్కరించాలంటూ దాదాపు 360 కిలోమీటర్ల పాదయాత్రను ఈ గ్రామస్థుల చేపట్టారు. అధికార టీఆర్ ఎస్ పార్టీకి చెందిన సర్పంచ్ స్వరూప నాయకత్వంలో ఈ పాదయాత్ర ప్రారంభమైంది. అయితే అంతకు ముందు అశ్వారావుపేట ఎమ్మెల్యే నాగేశ్వర రావు ఈ గ్రామస్థులతో చర్చలు జరిపారు. అయినా తాము పాదయాత్ర చేసి తీరుతామని గ్రామస్థులు బయల్దేరారు.