అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అల్లర్లకు కారణమైన వారిని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. ఈ దర్యాప్తును వేగవంతం చేశారు పోలీసులు. అగ్నిపథ్ ను వ్యతిరేకిస్తూ భారీ సంఖ్యలో సికింద్రాబాద్ స్టేషన్లోకి చొరబడి నానా బీభత్సం చేసిన విషయం తెలిసిందే. కొన్ని ప్రైవేట్ డిఫెన్స్ అకాడెమీ గ్రూపుల ప్రమేయం ఈ అల్లర్లలో వుందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వాట్సాప్ చాట్స్, వీడియోలు, సోషల్ మీడియా పోస్టులను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. వాటి మాధ్యమంగా ఎవరెవరు ఏఏ పోస్టులు పెట్టారన్న పరిశీలనలో పోలీసులు నిమగ్నమయ్యారు. అయితే.. ఇప్పటి వరకూ ఆందోళనలకు కారకులైన 200 మందిని పోలీసులు గుర్తించారు. సాంకేతిక ఆధారాలు, మౌలిక ఆధారాలను సేకరిస్తున్నారు.