అగ్ర దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న చిత్రం పొన్నియన్ సెల్వన్-1. ఈ చిత్రం టీజర్ ను మహేశ్ బాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్రం యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కల్లు, పాట, రక్తం, పోరాటం అంతా దాన్ని మర్చిపోవడానికే.. ఆమెను మరిచిపోవడానికే.. నన్ను నేను మరిచిపోవడానికే అంటూ విక్రమ్ పలికిన మాటలు భలే అనిపిస్తున్నాయి.
చోళ రాజ్యం నేపథ్యంలోనే ఈ సినిమా సాగుతుంది. ప్రధాన పాత్రధారులుగా విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష. లైకా ప్రొడక్షన్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా దీనిని నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. సెప్టెంబర్ 30 న మొదటి భాగం వస్తుంది. దీని టీజర్ ను హిందీలో అమితాబ్, మలయాళంలో మోహన్ లాల్, కన్నడలో రక్షిత్ శుట్టి, తమిళంలో సూర్య విడుదల చేశారు.