13 రాష్ట్రాలు విద్యుత్ బకాయిలు చెల్లించని కారణంగా విద్యుత్ పంపిణీ సంస్థలు ఇంధన ఎక్స్ఛేంజీల నుంచి జరిపే రోజువారీ కరెంటు కొనుగోళ్లను కేంద్రం నిషేధించింది. ఈ జాబితాలో తెలంగాణ, ఏపీతో సహా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్నాటక, తమిళనాడు, బిహార్, ఛత్తీస్ గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలున్నాయి. ఆయా రాష్ట్రాలు బకాయిలు చెల్లించని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర విద్యుత్ శాఖ చెబుతోంది. 13 రాష్ట్రాల్లోని 27 పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల పవర్ ట్రేడింగ్ ను నిషేధించాలని ఇండియన్ ఎనర్జీ ఎక్సేజంచీ, పవర్ ఎక్సేంఛ్ ఆఫ్ ఇండియా, హిందూస్తాన్ పవర్ ఎక్స్జేంచీలను కేంద్రం కోరింది.
దీంతో ఒక్క సారిగా సంచలనం రేగింది. కేంద్రం వివరాల ప్రకారం తెలంగాణ రూ. 1380 కోట్లు, ఏపీ రూ.412 కోట్లు, తమిళనాడు రూ. 924 కోట్లు, రాజస్థాన్ రూ.500, జమ్మూ కాశ్మీర్ రూ. 434కోట్లు, మహారాష్ట్ర 381, చత్తీస్ గఢ్ రూ. 274కోట్లు, మధ్యప్రదేశ్ రూ. 230 కోట్లు, జార్ఖండ్ రూ.218 కోట్లు, బీహార్ రూ. 112 కోట్లు చొప్పున, మొత్తం సుమారు 5800కోట్లు బకాయి పడినట్లు తెలుస్తోంది. అయితే… ఏపీ అధికారులు దీనిపై వివరణ ఇచ్చారు. తెలంగాణ అధికారులు మాత్రం ఇంకా ఎలాంటి స్పందనా తెలియజేయలేదు.