తమకు థియేటర్స్ గుడి లాంటివని రెబల్ స్టార్ ప్రభాస్ అన్నారు. తప్పకుండా సినిమాని థియేటర్ లోనే చూడండి అని ప్రభాస్ కోరారు. ఇంట్లో దేవుడు వున్నాడని గుడికి వెళ్లడం మానేస్తామా? అంటూ ప్రశ్నించారు. సీతారామం మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ ముఖ్య అతిథిగా వచ్చాడు. కొన్ని సినిమాలు థియేటర్ లోనే చూడాలని, సీతారామం కూడా అక్కడే చూడాలన్నారు. నిర్మాత అశ్వినీ దత్ గొప్ప నిర్మాత అని, ఆయన లాంటి వారు తెలుగు పరిశ్రమలో వుండటం అదృష్టం అన్నారు. అందరూ ఈ సినిమాని థియేటర్ లో చూసి, విజయవంతం చేయాలన్నారు.
దుల్కర్ సల్మాన్, మ్రుణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించారు. రష్మిక మందన్న, హీరో సుమంత్ కీలక పాత్రలలో నటించారు. 1965 బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఈ నెల 5 న ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. వైజయంతీ మూవీస్ సమర్పణ. అశ్వినీ దత్ చిత్ర నిర్మాత.