టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్, బాలీవుడ్ నటి కృతి సనన్ డేటింగ్‌లో ఉన్నారంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ.. టాలీవుడ్, బాలీవుడ్ మీడియాలో సైతం వార్తలు వచ్చాయి. కొన్ని రోజుల క్రిందట వీరిద్దరి పెళ్లి హాట్ టాపిక్. మళ్లీ ఇప్పుడూ హాట్ టాపిక్ గానే నిలిచింద. సోషల్ మీడియా అంతటా ఇదే వార్త. అయితే…. దీనిపై హీరో ప్రభాస్ టీం స్పందించింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపింది. అవన్నీ రూమర్సే అంటూ కొట్టిపారేసింది. ‘ప్రభాస్, కృతి సనన్ ఇద్దరూ కేవళం మంచి స్నేహితులు మాత్రమే. వీరిద్దరి ఎంగేజ్మెంట్ అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు’ అని వివరణ ఇచ్చింది.
ప్రభాస్, కృతి సనన్ జంటగా ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ చిత్రం తెరకెక్కుతోంది. రామాయణం కథ ఆధారంగా ఈ మూవీ రాబోతుంది. ఇందులో సీత పాత్రలో కృతి, రాముడి పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారు. ఎప్పుడైతే ఆదిపురుష్ మూవీ సెట్స్‌పైకి వెళ్లిందో.. అప్పటి నుంచి ప్రభాస్, కృతి సనన్ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు షికారు చేస్తున్నాయి.