వాస్తుశిల్పి, తెలుగుభాషాభిమాని, మా గౌరవ సలహాదారులు శ్రీ మాదాల ఆదిశేషయ్య ప్రపంచతెలుగువెబ్సైట్ ను ఈ రోజు ఉదయం 10.30 నిమిషాలకు చెన్నైలో ఆవిష్కరించారు. దేశంలో అనేక వెబ్ పేపర్లు , ఈపేపర్లు ఉండగా మళ్లీ ఇటువంటి పేపర్లు దేనికి అనే ప్రశ్న తలెత్తవచ్చు. ఆ ప్రశ్న అడగడంలో పొరపాటేమీ లేదు. మేం ఈ వెబ్ పేపర్‌ను ప్రారంభించడంలో ప్రధానోద్దేశం, ఏ వ్యాపార ప్రయోజనం లేకుండా నిష్పక్షపాతంగా, ఎవరికీ కొమ్ము కాయకుండా వార్తలు అందించడంతో పాటు, ఎవరికీ తెలియని, ఎవరూ ఊహించని వార్తలు, విశ్లేషణలు అందించడం మా ప్రత్యేకత. పత్రికా రచనలో సుమారు మూడు దశాబ్దాలకు పైగా అనుభవం కలిగి ఉండి, విలువలకు, ప్రమాణాలకు కట్టుబడిన పాత్రికేయులు అందించే వార్తలు, విశేషాలు, విశ్లేషణల కదంబంగా ఉంటుంది మా వెబ్ పేపర్. మీ ఆదరణే మా బలం. మీ ప్రోత్సాహమే మాకు కొండంత అండ.
