సీఎం నితీశ్ కుమార్ పై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రశంసించారు. నితీశ్ కుమార్ కొత్త అధ్యయనానికి నాంది పలికారని పీకే అన్నారు. బిహార్ రాజకీయాల్లో ఇప్పుడు స్థిరత్వం వస్తుందన్నారు. కాంగ్రెస్, ఆర్జేడీతో కలిసి సీఎం నితీశ్ కొత్త కూటమి కట్టి, సీఎంగా మళ్లీ ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో పీకే పై విధంగా స్పందించారు. గత 10 సంవత్సరాల నుంచి బిహార్ లో రాజకీయ అస్థిరత నెలకొందని విమర్శించారు. అంచనాలు నెరవేరని సమయంలోనే రాజకీయ కూటముల్లో మార్పులు వస్తాయని పీకే పేర్కొన్నారు.
బిహార్ రాజకీయాల్లో నితీశ్ కుమార్ చాలా కీలకమని కొనియాడారు. కొత్త కూటమి గట్టిగా నిలబడుతుందన్నారు. అయితే… నితీశ్ సారథ్యంలోనికొత్త ప్రభుత్వం సరిగ్గా పనిచేస్తుందా? లేదా? అన్నదది చూడాలని అన్నారు. అతిపెద్ద పార్టీగా అవతరించిన తేజస్వీ యాదవ్… ఈ కూటమిలో కీ రోల్ ప్లే చేస్తారని అన్నారు. బిహార్ వేదికగా జరిగిన ఈ కొత్త పరిణామం కేవలం బిహార్ కు మాత్రమే పరిమితమని, దేశ వ్యాప్తంగా ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ ఏర్పడుతుందన్న నమ్మకం లేదని స్పష్టం చేశారు.