2023 యేడాది గాను పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి ధన్కర్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులు, అవార్డు గ్రహీతలు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి చింతల పాటి వెంకటపతి రాజు (కళారంగం), కోటా సచ్చిదానంద శాస్త్రి (కళా రంగం), తెలంగాణ నుంచి పసుపులేటి హనుమంతరావు (వైద్యం), రామకృష్ణారెడ్డి (సాహిత్యం), కమలేశ్ డి పటేల్ (సామాజిక సేవ), సంకురాత్రి చంద్రశేఖర్ (సామాజిక సేవ), విజయ్ గుప్తా (శాస్త్ర సాంకేతిక రంగం) నుంచి పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు.
ఇక… కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎం కృష్ణకు పద్మవిభూషణ్ అవార్డును బహుకరించారు. మొత్తం 54 మందికి రాష్ట్రపతి అవార్డులను ప్రధానం చేశారు.వీరితో పాటు ఆదిత్యా బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా, సింగర్ సుమన్ కల్యాణ్ పూర్ లు పద్మ భూషణ్ అందుకున్నారు.
కళంకారీ కళాకారుడు భానుభాయ్ చితారా, త్రిపుర గిరిజన నేత నరేంద్ర చంద్ర దెబ్బార్మా, ప్రీతికాకా గోస్వామి, బయాలజిస్ట్ మోడడుగు విజయ్ గుప్తా, ఇత్తడి పాత్రల రూపకర్త దిల్ షద్ హుస్సేన్, రతన్ సింగ్ జగ్గీ, స్టాక్ మార్కెట్ నిపుణుడు రాకేషన్ ఝన్ ఝన్ వాలా (ఆయన తరపున సతీమణి రేఖా అవార్డును అందుకున్నారు.) తదితరులు పద్మశ్రీ ని అందుకున్నారు.