ఏపీ హైకోర్టుకు కొన్ని రోజుల క్రిందట సుప్రీం కోర్టు 7 గురు న్యాయమూర్తులను సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. ఈ సిఫార్సులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఆమోద ముద్ర వేశారు. వీటికి సంబంధించిన ఉత్తర్వులను కేంద్ర న్యాయశాఖ జారీ చేసింది. దీంతో త్వరలోనే ఆ ఏడుగురు హైకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
కోర్టుల్లో న్యాయమూర్తులుగా బాధ్యతల్లో వున్న ఏడుగురిని న్యాయమూర్తులుగా ప్రమోషన్ కల్పిస్తూ సీజేఐ జస్టిస్ రమణ సారథ్యంలోని సుప్రీం కోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. అడుసుమిల్లి వెంకట రవీంద్ర బాబు, వక్కలగడ్డ రాధా కృష్ణ, బండారు శ్యాం సుందర్, ఊటుకూరు శ్రీనివాస్, బొప్పన వారాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి, తల్లాప్రగడ మల్లికార్జున, దుప్పల వెంకట రమణ ను సుప్రీం కొలీజియం న్యాయమూర్తులుగా సిఫార్సు చేసింది.