మరో 25 సంవత్సరాల్లో భారత్ విశ్వ గురువుగా మారుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రకటించారు. ప్రతి భారతీయుడి నరనరాల్లో సంస్కృతి, సంప్రదాయాలు జీర్ణించుకుపోయాయని అన్నారు. విశాఖ తీరంలో నిర్వహించిన నౌకాదళ దినోత్సంలో రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు. ఉజ్జ్వల భవిషత్తును సాకారం చేసుకునే దిశగా అమృత కాలంలోకి ప్రవేశించామని, 100 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవాలు చేసుకునే సమయం నాటికి ప్రపంచంలో భారత్ విశ్వగురు స్థానంలో వుంటుందని ధీమా వ్యక్తం చేశారు. భారత రక్షణ రంగంలో మహిళల పాత్ర కూడా అధికంగానే వుందని కొనియాడారు. 1971 లో పాక్ పై జరిగిన యుద్ధంలో విజయానికి గుర్తుగా ప్రతి యేడాది డిసెంబర్ 4 న నేవీ డే జరుపుకుంటామని, వారి త్యాగాల కీర్తించడం మన బాధ్యత అని రాష్ట్రపతి పేర్కొన్నారు.
దేశ రక్షణ రంగంలో మహిళల పాత్ర కూడా ఎంతో వుందని రాష్ట్రపతి ముర్ము గుర్తు చేశారు. 1971 లో పాక్ పై జరిగిన యుద్ధంలో విజయానికి గుర్తుగా ఏటా డిసెంబర్ 4 న నేవీ డే వేడుకలను జరుపుకుంటున్నామని అన్నారు. వారి త్యాగాలను కీర్తిస్తూ, స్మరించుకోవడం తమ కర్తవ్యమన్నారు. తీర రక్షణలో భారత నేవీ ఎంతో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. భారత నావికా దళం ఎంతో శక్తిమంతమైనదని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా వుంటోందన్నారు. ఇక.. నేవీ డే సందర్భంగా రాష్ట్రపతి ఇదే వేదికపై నుంచి ఎ డికేడ్ ఆఫ్ ట్రాన్స్ ఫర్మేషన్ సిగ్నలింగ్ పవర్ ఆఫ్ పార్టనర్ షిప్స్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.