రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ దేశ మంతా ప్రారంభమైంది. ఈ సందర్భంగా విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా మాట్లాడారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే అందరూ తనకే ఓటు వేయాలని కోరారు. మనస్సాక్షి చెప్పిన వ్యక్తికి ఓటేయాలని ఎంపీలు, ఎమ్మెల్యేలను ఆయన కోరారు. తాను చేసేది రాజకీయ పోరాటం మాత్రమే కాదని, ప్రభుత్వ వ్యవస్థల మీద పోరాటం చేస్తున్నానని, సహకరించాలని ఆయన కోరారు.
తనకు వ్యతిరేకంగా ఓట్లు వేయడానికి ప్రభుత్వం డబ్బులను పంచిందని సంచలన కామెంటస్ చేశారు. డబ్బును, అధికారాన్ని ఉపయోగించి, తనకు వ్యతిరేకంగా ఓట్లు వేయిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య రక్షణకు ఈ రాష్ట్రపతి ఎన్నికలు ఎంతో కీలకమని, ఇందులో పార్టీ విప్ జారీచేయదని అన్నారు. అందుకే మనస్సాక్షికి తగ్గట్టుగా ఓటెయ్యాలని ఆయన పిలుపునిచ్చారు.