Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

నేడే రాష్ట్రపతి ఎన్నికలు.. సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్

నేడే రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. పార్లమెంటుతో సహా అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఈ పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 776 మంది ఎంపీలు, 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు ఓటు వేస్తారు. మొత్తం 4,033 మంది ఎమ్మెల్యేలు ఈ పోలింగ్ లో ఓటు వేయనున్నారు. వీరంతా ఓటింగ్ బ్యాలెట్ పేపర్ విధానంలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

 

ఎన్డీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము బరిలోకి దిగుతున్నారు. ఇక విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలోకి దిగుతున్నారు. ఈ ఇద్దరూ దేశ వ్యాప్తంగా ప్రచారం నిర్వహించి, తమకు మద్దతివ్వాల్సిందిగా అభ్యర్థించారు. మరోవైపు ఈ నెల 21 న రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికలు దామాషా నిష్పత్తిలో జరుగుతున్నాయి. ఒక్కో ఓటరు పోటీలో వున్న ఇద్దరు అభ్యర్థలకు తమ ప్రాధాన్యతా సంఖ్యను ఇచ్చుకునే ఛాన్స్ వుంది. ఈ ఎన్నికల్లో ఎంపీలకు ఆకుపచ్చ రంగు, ఎమ్మెల్యేలకు గులాబి రంగు బ్యాలెట్ ఇస్తారు. ఇక.. ఓటింగ్ సమయంలో వాడే పెన్నును కేంద్ర ఎన్నికల సంఘమే సరఫరా చేస్తుంది. ఈ పెన్నుతోనే ఓటింగ్ వేయాలి. ఇతర పెన్నులతో గనక ఓటు వేస్తే ఆ ఓటు చెల్లదని స్పష్టంగా చెప్పేస్తారు. ఇక… ద్రౌపది ముర్ము గెలుపు లాంఛనమే అయినా… మెజారిటీ ఎంత అన్నదే ప్రాధాన్యం.

Related Posts

Latest News Updates