రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైపోయింది. మొట్టమోదటి ఓటును ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ లో వినియోగించుకున్నారు. మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక… ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ తమ రాష్ట్రాల అసెంబ్లీలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. యూపీ సీఎం యోగి, ఏపీ సీఎం జగన్, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తమ తొలి ఓటు వేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ నెల 21 న ఫలితాలు వెలువడుతాయి.
