దేశ వ్యాప్తంగా జరుగుతున్న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 99.18 శాతం పోలింగ్ జరిగిందని లోక్ సభ రిట్నరింగ్ అధికారి ప్రకటించారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో పోటీ చేశారు. ఇక.. ముర్ముకు ఎన్డీయే పక్షాలు, శివసేన, టీడీపీ, అకాళీదల్, బీజేడీ మద్దతిచ్చాయి. కొన్ని చోట్ల క్రాస్ ఓటింగ్ కూడా జరిగింది. పార్లమెంట్ ఆవరణలోని పోలింగ్ కేంద్రంలో ఉదయం 10 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ప్రధాని మోదీ తొలి ఓటు వేశారు. ఆ తర్వాత కేంద్ర మంత్రులు, ఎంపీలు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇతర ముఖ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్డీయే అభ్యర్థి ముర్ము 63 శాతం శాతానికి పైగా మెజారిటీతో గెలిచే ఛాన్స్ వుంది. క్రాస్ ఓటింగ్ పెరిగితే మరింత మెజారిటీ పెరుగుతుంది.
ఉదయం 10 గంటలకు పార్లమెంట్ ఆవరణలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ లో ప్రధాని మోదీ తొలి ఓటు వేశారు. ఆ తర్వాత కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, ఎంపీ రాహుల్ గాంధీతో పాటు ఇతర పార్టీల ఎంపీలు కూడా ఓట్లు వేశారు. ఇక… అన్ని రాష్ట్రాల్లోని అసెంబ్లీలో ఎన్నికల పోలింగ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఇక… మన తెలుగు రాష్ట్రాల్లోనూ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఏపీలో తొలి ఓటు సీఎం జగన్ వేశారు. ఆ తర్వాత ప్రతిపక్ష నేత చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఓటు వేశారు. ఇక..తెలంగాణలో తొలి ఓటు మంత్రి కేటీఆర్ వేశారు. ఆ తర్వాత మంత్రులు వేశారు. మధ్యాహ్నం సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు ఓటు వేశారు.