ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ దేశంలోని ఎంతోమందికి స్ఫూర్తి అని ప్రధాని మోడీ అన్నారు. రాజ్యసభ చైర్మన్గా తొలిసారి బాధ్యతలు చేపట్టిన ధన్కర్కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నో బాధ్యతలను ధన్కర్ సమర్ధవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. రైతుబిడ్డ ఉపరాష్ట్రపతిగా ఎన్నకోవడం సంతోషంగా ఉందని మోడీ తెలిపారు. ధన్కర్ కు చట్టాలపై ఎంతో అవగాహన ఉందన్నారు. ఇక… ఇటీవలే కన్నుమూసిన ములాయం సింగ్ యాదవ్, తెలుగు నటుడు, మాజీ ఎంపీ కృష్ణకు రాజ్యసభ సభ్యులు నివాళులు అర్పించారు. ఈ సమావేశాలు ఈ నెల 29 వరకూ కొనసాగనున్నాయి. 23 రోజుల్లో మొత్తం 17 బిల్లులను ఆమోదించనుంది.
ఇక… కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్ కూడా మాట్లాడారు. ఓ రైతు బిడ్డ ఉప రాష్ట్రపతి కావడం గర్వంగా వుందన్నారు. ప్రధాని మోదీ చాయ్ అమ్మే కుటుంబంలో జన్మించారని, స్వతహాగా ఆయన కూడా చాయ్ అమ్మారని గుర్తు చేశారు. 5 దశాబ్దాలకు పైగా సమాజంలో సేవలు చేస్తున్నారని పేర్కొన్నారు. సాధారణ జీవితాల నుంచి వచ్చిన వారు ఇప్పుడు రాజకీయాల్లో అత్యున్నత పదవిలో వుండటం ముదావహం అని అన్నారు.