ప్రముఖ హీరోయిన్ ప్రియా ఆనంద్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. వివాదాస్పదంగా మారి, కైలాస అనే దీవిలో ఉంటున్న స్వామి నిత్యానందను పెళ్లి చేసుకోవాలని ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రియా ఆనంద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తిని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలను చూసి అభిమానులు , ఇతరులు అవాక్కయ్యారు. ఈ మధ్య ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.
ట్విట్టర్ ఖాతాలో స్వామి నిత్యానంద సూక్తులు ఎందుకు షేర్ చేస్తున్నారు. అని అడగ్గా… తనకు నిత్యానంద అంటే ఎంతో ఇష్టమని, ఎన్నో విమర్శలు ఎదురైనా.. వేల మందిని ఆకట్టుకున్నారు. కుదిరితే ఆయన్ని పెళ్లి చేసుకోవాలని వుంది. ఒకవేళ ఆయనతో పెళ్లి జరిగితే.. నా పేరు కూడా మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా ఇద్దరి పేర్లు కాస్త ఒకేలా వుంటాయి అంటూ ప్రియా ఆనంద్ అన్నారు.