బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా – హాలీవుడ్ సింగర్ నిక్ జొనాస్ తమ గారాల పట్టిని మొదటిసారి ప్రపంచానికి చూపించారు. ప్రియాంక తన కూతురు మాల్తి మరియెస్ ఫొటోలను ఈరోజు షేర్ చేసింది. ఈ నెల 15న మాల్తి మొదటి పుట్టిన రోజు జరిగింది. హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ జొనాస్ సోదరులకు సోమవారం స్టార్ అవార్డు ప్రదానం చేసింది. ఈ వేడుకలకు ప్రియాంక కూతురు మాల్తితో కలిసి హాజరైంది. ఈ ఫొటోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ప్రియాంక ఒళ్లో కూర్చొని చిరునవ్వులు చిందిస్తున్న మాల్తీ వైట్ డ్రెస్ లో భలే క్యూట్ గా కనిపిస్తోంది.
https://twitter.com/Kattysupremacy/status/1620322440412033025?s=20&t=f6fIXB1MxAcFG7YeO3o7kA
నటుడు నిక్ జొనాస్, ప్రియాంకా చోప్రా 2018 డిసెంబర్ 1న పెళ్లి చేసుకున్నారు. 2022 జనవరి 15న ఈ జంట తల్లిదండ్రులయ్యారు. సరోగసీ ద్వారా బిడ్డను కన్నారు. ప్రియాంక, నిక్ ఇంతకుముందు సోషల్‌మీడియాలో తమ బిడ్డ ఫొటోలు చాలా పోస్ట్ చేశారు. కానీ, వాటిలో పాప ముఖం కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. మాల్తి ముఖాన్ని తెల్లని హార్ట్ సింబల్‌తో కనిపించకుండా చేసేవారు. అయితే.. ఎట్టకేలకు ఈరోజు అభిమానులు, మీడియా కోసం మాల్తి ఫేస్‌ను అందరికీ చూపించారు.