శ్రీలంకలో నిరసనలు కొనసాగుతూనే వున్నాయి. ప్రెసిడెంట్ గొటబయ రాజపక్సే ఇంట్లోకే ఏకంగా చొచ్చుకెళ్లారు. ఇంట్లోని స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతూ ఎంజాయ్ చేశారు. అంతే కాకుండా ఇంట్లో వున్న కోట్లాది రూపాయల కట్టలను కూడా స్వాధీనం చేసుకున్నారు. వాటిని అధికారులకు అందించారు. అయితే.. ఆ కరెన్సీని నిరసనకారులు లెక్కబెడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
మరోవైపు వేలాది మంది నిరసనకారులు ఆయన నివాసంలోకి చొచ్చుకెళ్లారు. అత్యధిక భద్రత వున్న ప్రదేశమైనా.. వేలాది మంది నిరసనకారులు ఆ భవనంలోకి చొచ్చుకెళ్లారు. ఆ భవనంలో ఎవరూ లేకపోయినా.. ఏసీలు పనిచేస్తూనే వుండటంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనకారులు ఎలాంటి హింసకు పాల్పడొద్దని ఆర్మీ చీఫ్ అభ్యర్థించారు. అయితే.. ఇంత జరుగుతున్నా.. శ్రీలంక అధ్యక్షుడు గొటబయ ఎక్కడున్నాడన్నది తెలియడం లేదు.