పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రెండో వివాహం నిరాడంబరంగా జరిగింది. డాక్టర్ గురుప్రీత్ కౌర్ ను సీఎం మాన్ రెండో వివాహం చేసుకున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కుటుంబీకులు, భగవంత్ మాన్ కుటుంబీకులు, ఆప్తుల మధ్య ఈ వివాహం నిరాడంబరంగా జరిగింది. అయితే సీఎం పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొత్త జీవితం ప్రారంభిస్తున్న భగవంత్ మాన్ దంపతులకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ శుభాకాంక్షలు తెలిపారు.
సీఎం భగవంత్ మాన్ కు ఇందర్ ప్రీత్ కౌర్ తో పెళ్లైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా వున్నారు. అయితే ఇందర్ ప్రీత్ కౌర్, భగవంత్ ఇద్దరూ విడిపోయారు. పిల్లలతో కలిసి ఇందర్ ప్రీత్ కౌర్ అమెరికాలో వుంటున్నారు. భగవంత్ మాన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో ఆ ప్రమాణ స్వీకారోత్సవానికి వారి పిల్లలు హాజరయ్యారు. అయితే రెండో పెళ్లి చేసుకోవాలని భగవంత్ మాన్ తల్లి, సోదరి ఒత్తిడి తేవడంతో ఆయన డాక్టర్ గురుప్రీత్ కౌర్ ను రెండో పెళ్లి చేసుకున్నారు.