పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కడుపులో తీవ్రమైన నొప్పి రావడంతో బుధవారం రాత్రి ఆయన్ను ఢిల్లీలోని అపోలోలో చేర్పించారు. ఆయనకు సోకిన ఇన్ ఫెక్షన్ ను వైద్యులు గుర్తించారు. దీనికి సంబంధించిన చికిత్స కొనసాగిస్తున్నారు. మరోవైపు గ్యాంగ్ స్టర్, టాస్క్ ఫోర్స్ పోలీసులకు మధ్య జరిగిన ఎన్ కౌంటర్ పై కూడా సీఎం భగవంత్ మాన్ ఆస్పత్రి వేదికగానే స్పందించారు. రాష్ట్ర పోలీసులకు, గ్యాంగ్ స్టర్ నిరోధక టాస్క్ ఫోర్స్ కు ఆయన అభినందనలు ప్రకటించారు.
పంజాబీ గాయకుడు సిద్దూ మూసేవాలా హత్య కేసులో నిందితులుగా వున్న ఇద్దర్నీ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయంతెలిసిందే. సిద్దూ హత్య తర్వాత వీరిద్దరూ పరారీలో వున్నారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. భక్నా గ్రామంలో గ్యాంగ్ స్టర్లు టాస్క్ ఫోర్స్ పై కాల్పులు చేశారు. దీంతో పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపి, వారిని హతమార్చారు.