ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కుమారుడు, హీరో ఆకాశ్ పూరీ నటించిన తాజా చిత్రం చోర్ బజార్. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ కు పూరీ జగన్నాథ్ డుమ్మా కొట్టారు. ఈ వేదికపైనే నిర్మాత బండ్ల గణేశ్ పూరీపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కన్న కొడుకు ఫంక్షన్ కు వచ్చేంత టైం కూడా లేదా? అంటూ ఘాటు వ్యాఖ్యలే చేశారు. దీనిపై పూరీ జగన్నాథ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు.
గుర్తు పెట్టుకోండి.. మన నాలుక కదులుతున్నంత సేపూ మనం ఏమీ నేర్చుకోలేం. అందుకే లైఫ్ లో ఎక్కువ టైం వింటూ వుంటే చాలు. మీ ఫ్యామిలీ మెంబర్స్, క్లోజ్ ఫ్రెండ్స్, ఆఫీస్ జనాలు, భార్య ముందు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. చీప్ గా వాగొద్దు. ప్రవర్తించొద్దు కూడా. మన వాగుడు మన కెరీర్ ను, మన క్రెడిబులిటీని డిసైడ్ చేస్తుంది. నొప్పింపక.. తానొవ్వక.. అన్నట్లుగా. లేదంటే నాలుక కొరికేసుకోవడం మంచిది. నీ బతుకు.. నీ చావు నాలుక మీదే ఆధారపడి వుంటుంది అంటూ పూరీ జగన్నాథ్ ఓ ఆడియోను వదిలాడు.