ఢిల్లీలో పీవీ స్మృతి మందిరాన్ని నిర్మిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. అలాగే ఢిల్లీలోని పీఎం మ్యూజియంలో పీవీ గారి జ్ఞాపకాలను ఏర్పాటు చేశామన్నారు.మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు 101 జయంతిని పురస్కరించుకొని నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ లో నివాళులర్పించారు.
పీవీ చరిత్ర తెలిసేలా పుస్తకాలు విడుదల చేస్తున్నామని.. పీవీగొప్పతనాన్ని తెలిపే విధముగా తపాలా బిళ్ల విడుదల చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.