Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

భారత్ లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది : కేంబ్రిడ్జి యూనివర్శిటీలో రాహుల్

లండన్ లోని కేంబ్రిడ్జి యూనివర్శిటీ వేదికగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. భారత్ లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ విమర్శలు చేశారు. అంతేకాకుండా తనపై నిఘా పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పెగాసస్ ఉపయోగించిందని దుయ్యబట్టారు. కేంబ్రిడ్జి యూనివర్శిటీలోని విద్యార్థులను ఉద్దేశించి రాహుల్ గాంధీ 21 వ శతాబ్దంలో లెర్నింగ్ టు లిజన్ అనే అంశంపై మాట్లాడారు. తనతో పాటు మరికొంత నేతలపై కూడా కేంద్రం పెగాసస్ ఉపయోగించిందని రాహుల్ ఆరోపించారు.

 

భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంది. మేం ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్నాము అని పేర్కొన్నారు. తన ఫోన్లో పెగాసస్ స్పైవేర్ చొప్పించారని, చాలా మంది రాజకీయ నాయకుల ఫోన్లలోనూ పెగాసస్ ఉందంటూ పేర్కొన్నారు. ఫోన్‌లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఇంటెలిజెన్స్ లోని కొందరు అధికారులు తనకు చెప్పారని వెల్లడించారు. దేశంలో మీడియాను, న్యాయవ్యవస్థను కబ్జా చేసి, నియంత్రిస్తున్నారని ఆరోపించారు. ఇతరులపై నిఘా, బెదిరింపులు, మైనారిటీలు, దళితులు, గిరిజనులపై దాడులతో ప్రభుత్వంపై అసమ్మతిని అణగదొక్కుతున్నారని విమర్శించారు.

Related Posts

Latest News Updates