నెరిసిన గడ్డం, నెరిసిన జుట్టు, టీషర్ట్…. ఇన్ని రోజుల పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్టైల్ ఇదీ…. మొన్నటి వరకూ జరిగిన భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ ఇలాగే కనిపించారు. కానీ… ఒక్కసారిగా రాహుల్ గాంధీ మారిపోయారు. జుట్టు కత్తిరించి, గడ్డం తీసేసి… నీట్ గా ట్రిమ్ చేసుకుని కనిపించారు. అలాగే నీట్ గా ఓ సూట్ ధరించి… పక్కా ప్రొఫెషనల్ గా కనిపించారు. ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రాహుల్ గాంధీ ప్రస్తుతం వారం రోజుల పాటు లండన్ లో పర్యటిస్తున్నారు. కేంబ్రిడ్జి యూనివర్శిటీలో ఉపన్యసించనున్నట్లు కాంగ్రెస్ పేర్కొంది. లెర్నింగ్ టు లిసన్ అనే అంశంపై ప్రసంగించనున్నారు. అలాగే బిగ్ డేటా అండ్ డెమోక్రెసీ, ఇండియా- చైనా సంబంధాలపై కూడా ప్రసంగించనున్నారు.
మార్చి 5న ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సభ్యులతో కూడా రాహుల్ సమావేశమవుతారు. రాహుల్‌కు కేంబ్రిడ్డ్ జేబీఎస్ ఆహ్వానం పలుకుతూ ఒక ట్వీట్ కూడా చేసింది. ”మా క్రేంబ్రిడ్జి ఎంబీఏ ప్రోగ్రాం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎంపీ, ప్రముఖ విపక్ష నేత రాహుల్ గాంధీని సాదరంగా ఆహ్వానిస్తోంది. విజిటింగ్ ఫెలో ఆఫ్ కేంబ్రిడ్జి జేబీఎస్‌గా ఆయన లెర్నింగ్ టు లిజన్ ఇన్ ది ట్వంటీ ఫస్ట్ సెంచరీ” అనే అంశంపై ఇవాళ మాట్లాడతారు” అని ఆ ట్వీట్‌లో పేర్కొంది.