మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గా బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ నార్వేకర్ ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రిగా ఏకనాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. స్పీకర్ ను ఎన్నుకోవడానికి అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ గా 5 సార్లు విజయం సాధించిన రాహుల్ నార్వేకర్ ఎన్నికయ్యారు. ఇక.. మహావికాస్ అగాఢీ స్పీకర్ గా రాజన్ సాల్వీ బరిలోకి దిగారు. స్పీకర్ ఎన్నికల్లో ఈ ఇద్దరూ తలపడగా రాహుల్ నార్వేకర్ కు 164 ఓట్లు వచ్చాయి. వ్యతిరేకంగా 107 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికకు సమాజ్ వాదీ పార్టీ, ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా దూరంగా వున్నారు.
ఈ సమావేశం తర్వాత డిప్యూటీ స్పీకర్ మాట్లాడారు. విప్ కు వ్యతిరేకంగా శివసేన ఎమ్మెల్యేలు ఓట్లు వేశారని తెలిపారు. స్పీకర్ ఎన్నికకు సంబంధించిన ప్రక్రియ అంతా వీడియో రికార్డు చేశ:ామని తెలిపారు. పార్టీ విప్ కు వ్యతిరేకంగా ఓటు వేసిన వారిపై పార్టీ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మరో వైపు కొత్తగా సీఎం బాధ్యతలు చేపట్టిన ఏకనాథ్ షిండే బలపరీక్షను ఎదుర్కోబోతున్నారు. సోమవారం బలపరీక్ష జరగనుంది. అయితే.. స్పీకర్ గా నార్వేకర్ విజయం సాధించడంతో ఇప్పటి వరకూ షిండే శిబిరంలో వున్న రెబెల్స్ అందరూ షిండే వెంటే వున్నారని తేలిపోయింది. రేపు జరిగే విశ్వాస పరీక్షలోనూ వారందరూ షిండే వెంటే ఉంటారని రూఢీ అయిపోయింది.