సీనియర్ సిటిజన్లకు, జర్నలిస్టులకు రైల్వే శాఖ భారీ షాక్ నే ఇచ్చింది. సీనియర్ సిటిజన్లకు టిక్కెట్ ధరపై ఇస్తున్న రాయితీని కట్ చేసేసింది. అలాగే విద్యార్థులు, జర్నలిస్టులకు వివిధ కోటాల్లో ఇస్తున్న సబ్సిడీలను రైల్దే రద్దు చేసేసింది. ఇకపై ఇవి చల్లవని తేల్చి చెప్పింది. ఈ సబ్సిడీలను మాత్రం ఇక ఎప్పుడూ పునరుద్ధరించమని రైల్వే శాఖ తేల్చి చెప్పేసింది. కోవిడ్ కారణంగా దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఈ రాయితీలను ఉపసంహరించిన విషయం తెలిసిందే. అయితే.. సీనియర్ సిటీజన్స్ కి మాత్రం 40 శాతం రాయితీ వుండేది. దీనిని కూడా రైల్వే తీసేసింది. అయితే… ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ కిందికి వచ్చే 4 రకాల వర్గాల వారికి. 11 వర్గాల్లోకివచ్చే రోగులకు, విద్యార్థులకు మాత్రం రాయితీ కొనసాగిస్తామని రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ప్రకటించారు.
