తాజాగా అనసూయ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. తన ట్వీట్స్‌ను రాజకీయం చేయవద్దంటూ ఆమె కోరుతోంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు బుల్లితెరపై పలు షోలతో బిజీగా ఉంది యాంకర్ అనసూయ . ఇటీవలె జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పిన యాంకర్ అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలో బిజీగా ఉంటోంది. గత నెలలో దర్జా మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చిన అనసూయ.. త్వరలో వరుస చిత్రాలతో ఆడియన్స్‌ను అలరించనుంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు బుల్లితెరపై పలు షోలకు యాంకర్‌గా కంటిన్యూ అవుతోంది. తాజాగా అనసూయ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట చర్చకు దారి తీసింది. తన చెప్పే అభిప్రాయాలకు రాజకీయ రంగు పూయొద్దంటూ నెటిజన్లను కోరింది. ఇటీవల గుజరాత్‌కు చెందిన బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచార కేసులో జైలు నుంచి దోషులు విడుదలైన సంగతి తెలిసిందే. వారికి ఓ సంస్థ సన్మానం చేయగా.. మంత్రి కేటీఆర్ ట్విటర్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ట్వీట్‌ను అనసూయ రీట్వీట్ చేస్తూ.. ‘దారుణం! మనం స్వేచ్ఛను పునర్నిర్వచిస్తున్నట్లు అనిపిస్తోంది.. అంటే రేపిస్టులను విడిచిపెట్టి.. మహిళలను ఇంటికే పరిమితం చేసేలా ఉన్నాం..’ అంటూ ఆమె రాసుకొచ్చింది. అయితే ఈ ట్వీట్‌పై అనసూయకు నెటిజన్లు కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్‌లో మైనర్‌పై అత్యాచారం జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదని అడిగారు.
